5 ఉత్తమ ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మీకోసం తెలుగులో
మీరు ప్రారంభించటానికి ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (Best Blogging Platform) కోసం చెక్ చేస్తున్నారా? ఐతే టెస్ట్ డ్రైవ్ గా ఉచిత బ్లాగ్ (Free Blog) చేయడానికి ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఉచిత ప్లాట్ఫామ్ లను ఒక్కసారి చూడండి.
తగిన ఉచిత బ్లాగ్ సైట్‌లను ఎంచుకోవడం ప్రారంభ దశలో కష్టతరమైన భాగం. ఎందుకంటే వెబ్‌లో చాలా ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు నడుస్తున్నాయి. కాబట్టి, మీరు మీ అవసరాలకు సరైన మరియు ఉత్తమమైన బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
Table of Contents
బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అంటే ఏమిటి?
బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అనేది మీ కంటెంట్‌ను ప్రచురించడానికి సహాయపడే ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది బాగా అభివృద్ధి చెందిన CMS (కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) గా చెప్పవచ్చు. ఇవి వెబ్‌సైట్ బిల్డర్‌లు గా (Wix) లేదా బ్లాగింగ్ అప్లికేషన్ గా (WordPress) లేదా బ్లాగింగ్ సాఫ్ట్‌వేర్ గా (Tumblr) డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్‌లతో వస్తుంది.
అతిపెద్ద బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఏది?
ప్రతి ప్లాట్‌ఫారమ్ ని వినియోగదారుని యొక్క అవసరానికి అనుగుణంగా, ప్రత్యేక లక్షణాలతో అభివృద్ధి చేయటం జరుగుతుంది. కాబట్టి, వీటిని అతి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు లేదా ఉత్తమ ప్లాట్‌ఫారమ్‌లు గా వేరు చేయడం కష్టం. ఇవి పూర్తిగా వినియోగదారుడి అవసరాలను బట్టి తయారు చేయబడుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారమ్‌లలో WordPress CMS ను అతి పెద్ద బ్లాగింగ్ ప్లాట్ ఫాం గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ లో 100 బ్లాగుల్లో దాదాపు 30శాతం వెబ్ సైట్లు WordPress తో తయారు చేస్తున్నారు అనడం దీనికి ఉదాహరణ.
మీ అవసరాన్ని తీర్చడానికి సరైన బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎలా కనుగొనాలి?
మీ బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎంపిక మీ అవసరాను గుణంగా ఉండాలి. ఇంటర్నెట్ లో అగ్ర బ్లాగులు ప్లాట్ఫామ్లు చాలా ఉన్నా ఈ బ్లాగింగ్ లో ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కృషి, అంకితభావం కచ్చితంగా ఉండాలి. అంతే కాదు, విభిన్న కోణాల్లో లో కంటెంట్ ను, రాస్తూ రోజువారి పోస్టింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, కంటెంట్ ప్రమోషన్లు చేయడం ద్వారా బ్లాగ్గింగ్ లో విజయం ని తక్కువ సమయంలోనే అందుకోవచ్చు.
మీరు సీజనల్ బ్లాగరు ఐతే మీ బ్లాగ్ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించడానికి మీకు ఏ ప్లాట్ ఫాం అనుకూలంగా ఉంటుందో సెర్చ్ చేసిఓ అంచనాకి రావాల్సి ఉంటుంది.
ఎందుకంటే, బ్లాగ్గింగ్ అనేది పూర్తిగా ఉచితం కాదు. ఇది కాస్త ఖరీదైన ప్రక్రియగా చెప్పవచ్చు. అంటే కాస్త డబ్బు ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ ఫలితాలు తక్కువ సమయంలో నే పొందే అవకాశం ఉంటుంది.
మీ అవసరానికి ఏ ప్లాట్‌ఫారమ్ సరిపోతుందో మీకు ఏదైనా అనుభవం ఉంటే, సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఖర్చును తగ్గించుకోవచ్చు.
నేను 2009లో నా బ్లాగింగ్ వృత్తిని ప్రారంభించాను. ఆ సంవత్సరం నుండి, నేను డబ్బు సంపాదించడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేశాను.
కానీ నేను కేవలం కొన్ని ప్లాట్‌ఫారమ్‌లతో మాత్రమే విజయం సాధించగలిగాను. ఎందుకంటే అన్ని బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి తగినవి కాదని తరువాత నేను ఆలస్యంగాగ్రహించాను.
ఆ అనుభవంతో, కొత్తవారికి సరైన ఎంపికను ఎంచుకోవడంలో సహాయపడటానికి నేను ఈ ఆర్టికల్ ను ప్రారంభించాను.
మీరు జర్నల్/డైరీ వంటి మీ సమాచారాన్ని పంచుకోవడానికి వ్యక్తిగత బ్లాగును సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, సాధారణ బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు సరిపోతాయి.
కానీ వాణిజ్య వ్యాపార ప్రయోజనాల కోసం విచ్ ప్లాట్‌ఫారమ్ లను ఎన్నుకోవడం అనేది ఇది ఒక విధంగా సమయం వృధా చేసుకున్నట్లే. వీటికి బదులు Self hosting WordPress ప్లాట్‌ఫారమ్ లను ఎన్నుకోవడం మంచిది.
ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ జాబితా ఉచితంగా వెబ్‌సైట్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది మరియు ఇవి 10 నిమిషాలలోపు ఉచిత బ్లాగింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి సులభమైన ఉచిత బ్లాగ్ వెబ్ సైట్ గా చెప్పొచ్చు.
5 ఉత్తమ ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (Best blogging platforms)
మొదట్లో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎంపిక కాస్త కష్టమే వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్నింటిని కింద తెలియజేస్తున్నాను. ఉపయోగించే ముందు ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క Terms and Conditions పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి వెళితే కింద ఇచ్చిన 5 బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లు వ్యాపారరీత్యా, అభిరుచులు రీత్యా అనుకూలం అని చెప్పొచ్చు. మీరూ ధైర్యంగా ట్రై చేసి చూడండి మరి.
1. బ్లాగర్.కామ్ (Blogger.com)
బ్లాగర్.కామ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ గా చెప్పొచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ గూగుల్ 2003లో కొనుగోలు చేసి, తన సర్వీసెస్ లో ఒకటిగా కలుపుకోవటం జరిగింది. ఇది క్రియేటివ్‌లు ఉపయోగించడానికి సులభమైన ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్.
ఈ ప్లాట్‌ఫారమ్ వాడటానికి కావల్సిందల్లా గూగుల్ ఐడి ఉంటే సరిపోతుంది అంతేకాదు మీరు ఎన్నుకోవడానికి మీ బ్లాగు కు పుష్కలం గా ఉచిత లభిస్తాయి.
అయితే ఈ ఈ బ్లాగ్ యొక్క బాహ్ రూపం అంత అద్భుతంగా వుండదు. అంతే కాదు దీనియొక్క URL చాలా వికృతంగా కనిపిస్తుంది. సాధారణ బ్లాగ్ కోసం దీనిని ఉపయోగించడం సులభము. కానీవ్యాపారరీత్యా చాల కట్టు బాట్లు దీనిలో ఉంటాయి.
కొత్త బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?
ఈ బ్లాగ్ ప్లాట్‌ఫారమ్ యొక్క వినియోగం ఇతర ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే ఉంటుంది. Blogger.comలో బ్లాగును ప్రారంభించడానికి, ముందుగా మీరు బ్లాగర్ ఖాతాను సృష్టించాలి. ఆపై ప్రాథమిక బ్లాగర్ టెంప్లేట్‌ని ఎంచుకుని, ఆపై మీ బ్లాగును ప్రచురించడానికి కావాల్సిన కంటెంట్ ను వ్రాయడం ప్రారంభించడమే.
- ముందుగా, మీరు Gmail ఉపయోగించి కొత్త బ్లాగర్ అకౌంట్ ను సృష్టించాలి.
- ఆపై Blogger.comకి వెళ్లి, బ్లాగ్ టైటిల్ పేరు, డొమైన్ URL (సబ్‌డొమైన్) వంటి వివరాలను పూర్తి చేయాలి. చివరగా Create A Blog అనే బటన్ పై క్లిక్ చేస్తే మీ బ్లాగ్ రెడీ అయిపోతుంది. అంతే ఇప్పుడు మీఉచిత బ్లాగర్ డొమైన్‌తో కొత్త బ్లాగ్ సిద్ధంగా వుంటుంది.
- ఆ తర్వాత బ్లాక్ డిజైన్స్ పూర్తిచేయడానికి ప్రైమరీ బ్లాగర్ టెంప్లేట్ ను ఎంచుకుని కావాల్సిన మార్పులను చేసుకోవటమే.
- ఇక మీరు మీ బ్లాగులో ప్రచురించడానికి కొత్త కంటెంట్ ను రాయడం ప్రారంభించవచ్చు.
బ్లాగర్.కామ్ వాడడానికి కారణాలు (Pros of Blogger.com)
- ఇవి గూగుల్ సిఫార్సు చేయబడింది.
- గూగుల్ ఎనలిటిక్స్ తో సులువుగా అనుసంధానం చేయవచ్చు.
- సాధారణ బ్లాగర్లకు ఇది సరైన ఎంపిక.
- ద్వారా పూర్తి వెబ్ సైట్ గా తయారు చేసుకోవచ్చు
- బ్లాగర్ సేవ ఉచితం
- సాధారణ అనుకూలీకరణ ఫీచర్‌తో ప్రారంభించడానికి ప్రాథమిక టెంప్లేట్‌లను అందించడం
- సాంకేతిక నైపుణ్యాలు లేకుండా ఉపయోగించడం మరియు నిర్వహించడం సులభం
- Google బలమైన సురక్షిత ప్లాట్‌ఫారమ్
ఎందుకు వాడకూడదు (Cons of Blogger.com)
- పూర్తి స్థాయి పరిమితులు మన బ్లాగు కస్టమైజేషన్కు ఇవ్వబడదు.
- కాస్త కోడింగ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది
- Seo చేయడానికి కాస్త కష్టపడాలి
- పరిమిత బ్లాగింగ్ సాధనాలు
- మీ బ్లాగ్ పెరిగినప్పుడు మీరు కొత్త ఫీచర్‌లను జోడించలేరు
- పరిమిత డిజైనింగ్ లక్షణాలు.
2. వర్డ్ ప్రెస్ (WordPress.com & WordPress.org)
మీ డిజైన్‌పై చక్కటి నియంత్రణ కోసం ఇది ఉత్తమ బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్. 2005 లో ప్రారంభమైన WordPress ప్లాట్‌ఫారమ్ ను రెండు రకాలుగా విభజించారు. దీనిలో wordpress.com అనేది ఓపెన్ సోర్స్ గాను, wordpress.org ను ఓపెన్ సోర్స్ మీద నిర్మించబడిన turnkey చెప్పవచ్చు.
వర్డ్ప్రెస్.కామ్లో అనేది ఇది పూర్తిగా ఉచితం. దీనికి ఉన్న పరిమితుల వలనా పాపులర్ లేకపోయింది. ఐతే wordpress.org మాత్రం అతి పెద్దగా వినియోగిస్తున్న CMS గా చెప్పవచ్చు.
WordPress.org ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లో అగ్ర స్థానాన్ని పొందిందని చెప్పవచ్చు. ఇది ఉచిత ప్లాట్ఫామ్ అయినప్పటికీ సైట్ మొత్తాన్ని లేదా బ్లాగ్ మొత్తాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ CMS ను వాడాలి అంటే మంచి WordPress web hosting service కు కొంత మొత్తాన్ని చెల్లించి కొంత స్పేస్ ను కొనాల్సి ఉంటుంది. ఈ ఈ సర్వీసుల్లో bluehost నమ్మకమైన సర్వీస్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఈ ప్లాట్‌ఫారమ్ నేర్చుకోవటానికి కాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన ప్లాట్‌ఫారమ్ లో మాదిరిగా రెడీ మేడ్ సెట్టింగ్స్ తో రాదు. ఇది పూర్తిగా మీరు చేయాల్సి ఉంటుంది.
మీ బ్లాగు ను కంటెంట్ తో మానిటర్ చేయాలి అనుకుంటే wordpress.com సరైన ఎంపిక కాదు. దీని కోసం wordpress.org వాడడం సరి అయిన ఆలోచనగా చెప్పవచ్చు. దీనికి నేను bluehost హోస్టింగ్ ను సిఫార్సు చేస్తాము. దీనిద్వారా పూర్తి స్థాయి మీ బ్లాగ్ యొక్క కస్టమైజేషన్ మీ కంట్రోల్లో ఉంటుంది.
వర్డ్ ప్రెస్ వాడడానికి కారణాలు (Pros of WordPress)
- WordPressని ఉపయోగించడం ద్వారా, మీరు మంచి నాణ్యత కలిగిన నాథీమ్‌లు మరియు ప్లగిన్‌లకు ఉచితంగా యాక్సెస్ ను పొందుతారు.
- ఈ CMS పూర్తిగా SEO-అనుకూలమైనది మరియు అన్ని థీమ్‌లు మరియు ప్లగిన్‌లు సెర్చ్ ఇంజన్‌లలో ఉత్తమ ర్యాంక్‌ని పొందేలా ఆప్టిమైజ్ చేయబడ్డాయి.
- WordPressలో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లు పూర్తిగా ఉచితం .
వర్డ్ ప్రెస్ ఎందుకు వాడకూడదు (Cons of WordPress)
- మాల్వేర్ నుండి మీ వెబ్‌సైట్‌ను రక్షించడానికి మీరు మీ ప్లగిన్‌లు మరియు థీమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
- థర్డ్-పార్టీ థీమ్‌లు మరియు ప్లగిన్‌ల వంటి అదనపు ఫీచర్‌లను జోడించడానికి మీరు ప్రీమియమ్‌కి అప్‌గ్రేడ్ చేయాలి.
- WordPress.com వ్యాపార వెబ్‌సైట్‌లకు తగినది కాదు.
3. విక్స్ (Wix.com)
Wix అనేది సాధారణ హోస్ట్ చేసిన బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది డ్రాగ్-అండ్-డ్రాప్ సాధనాలను ఉపయోగించి ఆకర్షణీయమైన వెబ్‌సైట్‌లను సృష్టించడానికి ఇది బావుంటుంది.
ఇది చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు బ్యాకెండ్ నుండి Wixతో పని చేయవలసిన అవసరం లేదు. WIX లో బ్లాగు తయారీ మరియు దాని వినియోగం చాలా బాగుంటుంది. అంతేకాదు ఇది ప్రారంభ మరియు ఆధునిక బ్లాగర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.
WIX ఫ్రీ ఎకౌంట్ ద్వారా 1 GB జిబి బ్యాండ్విడ్త్, 500 MB స్పేస్ ని పొందవచ్చు. దీనిద్వారా బ్లాగును ఉచితంగా ప్రారంభించవచ్చు.
బ్లాగర్.కామ్ మరియు wordpress.com మాదిరి గా డొమైన్ పేరు ఎక్కువగా storage గూగుల్ ఎనలిటిక్స్ మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో కావాలంటే WIX లో ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
విక్స్ లో బ్లాగ్ ని ఎలా ప్రారంభించాలి?
- Wixతో కొత్త బ్లాగును సృష్టించడం చాలా సులభం.
- మీరు Wix అధికారిక సైట్‌ని సందర్శించడం ద్వారా Wixతో ఉచిత వెబ్‌సైట్‌ను సృష్టించవచ్చు.
- ఆపై Wix కోసం సైన్ అప్ చేయండి.
- మీరు సృష్టించాలనుకుంటున్న సైట్‌ను ఎంచుకోండి మరియు మీకు కావలసిన టెంప్లేట్‌ను ఎంచుకోండి.
- Wix అనేది డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన టెంప్లేట్‌లతో కూడిన డ్రాగ్-అండ్-డ్రాప్ వెబ్‌సైట్ బిల్డర్.
- కానీ దాని ఉచిత ఖాతా కొన్ని లక్షణాలకు పరిమితం చేయబడింది.
విక్స్ వాడడానికి కారణాలు (Pros of Wix.com)
- డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన టెంప్లేట్‌లు
- ప్రొఫెషనల్ సైట్‌లను రూపొందించడానికి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్‌సైట్ బిల్డర్‌ని ఉపయోగించవచ్చు
- కొత్త బ్లాగును ప్రారంభించడానికి కోడింగ్ నైపుణ్యాలు అవసరం అవ్వవచ్చు
- మీరు మీ బ్లాగును త్వరగా మరియు సులభంగా సెటప్ చేయవచ్చు.
విక్స్ ఎందుకు వాడకూడదు (Cons of Wix.com)
- ఉచిత అకౌంట్లో పరిమితులూ ఎక్కువ
- మీరు తయారు చేసిన బ్లాగ్ లో Wix బ్రాండింగ్ నో వాటర్ మార్క్ మరియు ad రూపంలో చూపించబడతాయి.
- థర్డ్ పార్టీ ప్రకటన లకు పరిమితులు చాలా ఎక్కువ
- ఒకసారి సెట్ అప్ చేసిన టెంప్లేట్ నువ్వు రెండోసారి మార్చడం వీలు కాదు
- ఈ కామర్స్ వినియోగదారుల కు కూడా ఫీచర్ పై నిబంధనలు వర్తిస్తాయి
4. మీడియమ్ (Medium.com)
మీడియమ్ అనేది ఇది పరిమిత సోషల్ నెట్వర్కింగ్ ఫీచర్లతో తయారు చేయబడిన ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 2012 లో ట్విటర్ వ్యవస్థాపకులులో ఒకరైన ఇవాన్ విలియమ్స్ రూపొందించాడు. ఇది బ్లాగర్లకు, రచయితలకూ, జర్నలిస్టులకు వ్యవస్థాపకులు ఒక చక్కని వేదిక గా చెప్పవచ్చు.
దీనిద్వారా మీ కథనాలను 60 మిలియన్లు మీడియం ప్లాట్‌ఫారమ్ రీడర్ల ముందుకు తీసుకు వెళుతుంది. కాని ఇది మైక్రో బ్లాగరులకు సరి అయినది కాదు.
మీడియమ్ లో బ్లాగ్ ని ఎలా ప్రారంభించాలి?
మీడియం లో కొత్త ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవడానికి వివిధ పద్ధతుల ద్వారా ప్రారంభించవచ్చు.
ఇప్పటికే మీరు చాలా యూజర్నేమ్ పాస్వర్డ్లను వాడు కున్నట్లయితే, మీడియం లో అందించబడుతున్న గూగుల్,మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి ఎకౌంటుని క్రియేట్ చేసుకోవచ్చు.
ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత మీరు మీడియమ్ యొక్క WYSIWYG కంటెంట్ ఎడిటర్‌ని ఉపయోగించడం ద్వారా కంటెంట్‌ను వ్రాయడం తేలిక గా చేయొచ్చు
మీడియమ్ వాడడానికి కారణాలు (Pros of medium)
- మీ కంటెంట్ ని ఉపయోగించి 60 మిలియన్లకు పైగా ఉన్న మీడియం ప్రేక్షకులనూ చాలా సులభం గా ఆకర్షించవచ్చు.
- దీనికిఅదనపు సెటప్ లేదు.
- ఇది వాడాలి అంటే కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేదు.
- మీ అవసరానికి సంబందించిన లేదా మీ టాపిక్ కు సంబంధించిన సంబంధిత వ్యక్తులను సులభంగా ఆకర్షించడానికి ఇది మీకు సహాయపడుతుంది.
- మీరు డిజైన్‌కు బదులుగా రాయడంపై దృష్టి పెట్టవచ్చు.
- మీ కంటెంట్ అద్భుతమైన టైపోగ్రఫీ ఫీచర్‌లతో ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.
- మీ బ్లాగ్ కంటెంట్‌తో డబ్బు ఆర్జించడంలో మీడియం పార్టనర్ ప్రోగ్రామ్ మీకు సహాయం చేస్తుంది.
మీడియమ్ ఎందుకు వాడకూడదు (Cons of medium)
- బ్రాండ్ బిల్డింగ్స్ కు కావాల్సిన ఫీచర్లు ఈ ప్లాట్ ఫాం లో ఉండవు అందుచేత బ్రాండ్ ప్రమోషన్ సాధ్యం కాదు.
- ఒకవేళ మీ అకౌంట్ ని కోల్పోతే మీ ఫాలోవర్స్ ను కూడా కోల్పోతారు.
- గూగుల్ అనలిటిక్స్ ను కనెక్ట్ చేయడం సాధ్యం కాదు.
5. లింక్డ్ఇన్ (Linkedin.com)
లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ గా చెప్పవచ్చు. ఇది తమ వినియోగదారుల ప్రచురించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యాపారరీత్యా పబ్లిష్ చేసే కంటెంట్ కోసం వ్యాపార నిపుణుల కోసం అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఉత్తమ ప్లాట్ఫామ్ లో ఇది ఒకటి. అంతేకాదు ఇది ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీనిలో 260 మిలియన్ల కంటే ఎక్కువ మందే ఉన్నారు మీరు మీరు పోస్ట్ చేసే కంటే వీరు ముందుకు తీసుకువెళ్లి క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
లింక్డ్ఇన్ తన వినియోగదారులకు ప్రారంభించినా అనే సాధారణ ప్లాట్ఫామ్ పబ్లిక్ చేయడానికి సహాయపడుతుంది. దీనికోసం సన్ మీ linkedin account లాగిన్ అయిన తరువాత హోం పేజీలో పైన ఉన్న పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ linkedin ప్రేక్షకులను చేరుకోవడానికి guest పోస్టులు, మరి కథనాలు ప్రచురించడానికి అనుమతిస్తుంది. మీకు ఇదివరకే వెబ్ సైటు ఉంటే దాని కోసం లింకు బిల్డింగ్ చేయటానికి ఈ ప్లాట్‌ఫారమ్ ను ఉపయోగించుకోవచ్చు. ఐతే మీరు రాసే కంటెంట్ కనీసం వెయ్యి పదాలఅయినా ఉండాలి. అపుడే అప్పుడే linkdn ప్రేక్షకులను సునాయాసంగా చేయగలుగుతారు.
Linkedin లో బ్లాగ్ ని ఎలా ప్రారంభించాలి?
లింక్డ్ఇన్ పాల్ స్పీచ్ ఇన్ ఉపయోగించడానికి లిటిల్ లో ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీని ద్వారా మాత్రమే నెట్వర్క్ నిర్మించడం సాధ్యం అవుతుంది యొక్క లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్ యొక్క టెన్షన్ కండిషన్ చాలా కఠినంగా ఉంటాయి. ప్రొడక్ట్ ప్రమోషన్లు, వాటికి సంబంధించిన లింకులు, వైలెన్స్ (Violance) వీడియోలు ఇలాంటివి Spamming కార్యకలాపం కింద గుర్తిస్తుంది. ఇలాంటి కార్యకలాపాలు ఏమయినా వినియోగదారుల నుండి వచ్చినపుడు ముందు గా linkedin టీమ్ నోటీసులను పంపిస్తుంది అప్పటికీ Spamming జరుగుతున్నప్పుడు Account Suspendచేస్తుంది.
Linkedin ను ఉపయోగించటానికి ముందు అకౌంట్లోకి లాగిన్ అయి, అప్డేట్ యువర్ స్టేటస్ దగ్గర పెన్ను symbol దగ్గర క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క కథనాన్ని పబ్లిష్ చేయవచ్చు.
లింక్డ్ఇన్ వాడడానికి కారణాలు (Pros of LinkedIn)
- వ్యాపారాలు మరియు నిపుణుల కోసం పర్ఫెక్ట్.
- ఇంటర్‌ఫేస్ డిజైన్‌లో శుభ్రంగా మరియు సరళంగా ఉంటుంది.
- పబ్లిషింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం సులభం.
- ఒకే ఆలోచన కలిగిన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం సులభం.
లింక్డ్ఇన్ ఎందుకు వాడకూడదు (Cons of LinkedIn)
- పరిమిత అనుకూలీకరణ లక్షణాలు
- షెడ్యూలింగ్ ఫీచర్ అందుబాటులో లేదు
- వినోదానికి తగినది కాదు
మీరు ఈ ఉచిత బ్లాగ్ ప్లాట్‌ఫారమ్ పైన బ్లాగ్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా?
బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకునేటప్పుడు మీకు ఏ ఫీచర్లు అవసరమో పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రతి బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గొప్ప విషయం ఏమిటంటే అవి అనేక రకాల ప్రత్యేక లక్షణాలను అందిస్తాయి.
ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం కూడా సులభం, కాబట్టి మీరు మీ అవసరాలకు బాగా సరిపోయే బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకున్న తర్వాత, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా బ్లాగింగ్‌ను యాక్సెస్ చేయవచ్చు.
మీ స్వంత బ్లాగింగ్ బ్రాండ్‌ను నిర్మించడమే మీ లక్ష్యం అయితే, WordPress కంటే మెరుగైన ఎంపిక మరొకటి లేదు. మరియు బడ్జెట్‌లో WordPress యొక్క పూర్తి శక్తిని యాక్సెస్ చేయడానికి, Self Hosting WordPress మీ ఉత్తమ ఎంపిక.
మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏది ఉత్తమ పరిష్కారంగా అనిపిస్తుంది? అలాగే, మీరు గతంలో ఈ ఉచిత బ్లాగ్ సైట్‌లలో దేనినైనా ఉపయోగించినట్లయితే, మేము మీ అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము.
మీ అవసరాల కోసం ఉత్తమమైన ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం గురించి ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? వ్యాఖ్యల విభాగంలో అడగండి!