what is blogging in Telugu

బ్లాగింగ్ అంటే ఏమిటి? పూర్తి వివరాలు మీకోసం తెలుగులో

అంతర్జాలం (Internet) ప్రారంభం నుండి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటివరకు అంతర్జాలం ఉపయోగించే విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి కోసం చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల ముందు తీసుకువెళ్లడానికి అంతర్జాల వ్యాపార పద్ధతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

COVID-19 మహమ్మారి తర్వాత అంతర్జాల వాడకం మరింత వేగం పుంజుకుంది. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పనిచేయించడానికి, వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించి, ఇంటర్నెట్‌ను మాధ్యమంగా వాడుతూ ఉద్యోగాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశాయి.

అంతేకాదు, కెరీర్ పరంగా డిజిటల్ మార్కెటింగ్ మరింత వేగం పుంజుకుంది. ఈ విభాగంలో బ్లాగింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.

ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుగులో వివరంగా చెబుతున్నాను.

బ్లాగింగ్ అంటే ఏమిటి?

రాయటం ద్వారా గాని ఫోటోల రూపంలో గానీ అంతర్జాల మాధ్యమంలో స్వయంగా ప్రచురించే విధానాన్ని బ్లాగింగ్ అని అంటారు. ఇది వ్యక్తుల యొక్క డైరీ శైలి రాయుటకు అవకాశంగా ప్రారంభమైన ప్రక్రియ. అయితే దీన్ని చాలా వరకూ వ్యాపారాల కోసం కూడా వాడుతున్నారు.

ఈ బ్లాగ్ ద్వారా రీసెంట్  అప్డేట్లను తెలియజేయుటకు వ్యాపార నిమిత్తం ఆయా సంస్థల యొక్క కస్టమర్లకు వారి ప్రొడక్ట్స్ గురించి తమ వంతు విజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగిస్తున్నారు. 

బ్లాగ్ అనే పదాన్ని వాస్తవంగా “weblog” అని సంక్షిప్త రూపం నుండి వచ్చింది. ఈ వెబ్ సైట్ ను మొదట్లో వినియోగదారులను పంచుకోడానికి అనుమతించేవారు. ఆ తర్వాత వీటి వాడకం వివిధ రకాలుగా పెరిగింది.

ఈ బ్లాగ్ మాధ్యమాలు రాతపూర్వకంగా ఉండొచ్చు లేదా ఫోటోలు రూపంలో గానీ వీడియో రూపంలో గానీ ఉండొచ్చు. ఇది అనుకున్న వినియోగదారుని బట్టి ఉంటుంది.

బ్లాగింగ్ లో ముఖ్య పదాలు

 • బ్లాగ్: అక్షర రూపంలో గానీ చిత్ర రూపంలో గానీ వీడియోల రూపంలో గానీ అంతర్జాలంలో ప్రచురించుటకు వాడే మాధ్యమమే బ్లాగ్ అని అంటాము. ఈ బ్లాగులు పబ్లిక్ గా అందరూ చదివే వీలు కల్పించబడిన ఉంటుంది.
 • బ్లాగింగ్: ఇంటర్నెట్ లో కొత్త విషయాలను లేదా అనుభవాలను లేదా వ్యాపార సంబంధ విషయాలను చర్చించే నిరంతర ప్రక్రియనే బ్లాగింగ్ గా పిలుస్తారు.
 • బ్లాగర్: అంతర్జాలంలో నాణ్యమైన కంటెంట్ను ప్రచురించే ప్రతి వ్యక్తిని బ్లాగర్ గా పిలుస్తారు. వీళ్లను బ్లాగులు నిర్వహించే వ్యక్తులు గా పిలుస్తారు.
 • బ్లాగో స్పియర్: అనేక బ్లాగులు బ్లాగర్ల సమూహాన్ని బ్లాగో స్పియర్ గా చెప్పవచ్చు. అంటే క్లుప్తంగా

బ్లాగు + బ్లాగర్ + బ్లాగింగ్ = బ్లాగో స్పియర్

అసలు ఈ  బ్లాగింగ్ ఎప్పుడు మొదలైంది?

 • 1994లో జస్టిన్ హాల్ తయారు చేసిన links.net ను మొదటి బ్లాగ్ గా చెప్పొచ్చు. అయితే పీటర్ మెహ్రూన్ అను వ్యక్తి ఈ weblog అనే పదాన్ని విడదీసి we blog  గా petrme.com లో 1999 లో ఏర్పరచాడు. 
 • ఈ బ్లాగ్ అనే పదాన్ని pyrolate వాడుతూ  blogger.com కు పరిచయం చేశారు. 
 • ఆ తర్వాత 1998 లో ఓపెన్ డైరీ ని  లాంచ్చేసి దానిలో రీడర్ కామెంట్లను పరిచయం చేయడంతో ప్రధమ బ్లాగ్ కమ్యూనిటీ గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. 
 • దీని తర్వాత వచ్చిన Slashdot, Livejournal, conclave (syndication platform) మరియు Geocities ఇవన్నీబ్లాగ్ డైరీలుగ అప్పట్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి
 • 1999లో Evan Williams మరియు Meg Hourihan (Pyra Labs) బ్లాగర్.కామ్ ప్రారంభించారు. దీన్ని గూగుల్ 2003 లో కొనుగోలు చేసి హక్కులు సొంతం చేసుకుంది. ఈ ప్లాట్ఫాం ఇప్పటికీ వాడుతున్నారు. 
 • 2001 లో అమెరికన్ రాజకీయ నాయకులు వారి అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక వేదికగా మారిన తరువాత ఈ బ్లాగుల యొక్క ప్లాట్ ఫార్మ్స్ ని మరింతగా ఆధునీకరించారు.
 • ఆ తర్వాత బ్లాగులలో ఫ్రీ & పెయిడ్ బ్లాగులు కూడా మొదలయ్యాయి. 2013 తర్వాత బ్లాగింగ్ ఎరా (Blogging Era) లో ఒక నవయుగం మొదలైంది. లక్షల మందికి ఈ బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశాలు మొదలై ఎంతో మందికి భవిష్యత్తు గా మారాయి. 

మీరు బ్లాగును ఎందుకు ప్రారంభిస్తున్నారో ఆలోచించండి?

మీరు సందేశం లేదా ఆలోచన వంటి ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఆనందించే అంశం చుట్టూ సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నారా? 

బ్లాగ్ మీకు అనేక విషయాలను సాధించడంలో సహాయపడుతుంది, అవి: తెలియజేయడం, అవగాహన కల్పించడం, ప్రచారం చేయడం మరియు విక్రయించడం కూడా. 

చాలా మంది వ్యక్తులు బ్లాగును సృష్టించడానికి మరియు బ్లాగింగ్‌ను ఆస్వాదించడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి:

 • సృజనాత్మక వ్యక్తీకరణకు ఒక అవుట్‌లెట్‌గా ఉపయోగించడానికి.
 • నైపుణ్యాన్ని స్థాపించడానికి మరియు ప్రేక్షకులను నిర్మించడానికి.
 • ఇతరులతో నెట్‌వర్క్ చేయడానికి మరియు వ్యాపారాన్ని పెంచుకోవడానికి.
 • రచన మరియు ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడానికి.
 • స్వయం ఉపాధి పొందడం లేదా ఎక్కువ డబ్బు సంపాదించడం.

బ్లాగింగ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు కొంతమందికి, ఆన్‌లైన్‌లో అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఇది ఒక గొప్ప మార్గం గా మారింది. అంతే కాదు చాలా మంది దీన్ని పూర్తిస్థాయి ఉపాధిగా నిప్రారంభించి విజేతలుగా నిలుస్తున్నారు.

బ్లాగింగ్ కు కావలసిన ముఖ్య అంశాలు

బ్లాగింగ్ కు కావాల్సిన ముఖ్య అంశాలలో సరైన టాపిక్ ఎన్నిక, బ్లాగింగ్ ప్లాట్ ఫామ్, డొమైన్ నేమ్ మరియు వెబ్ హోస్టింగ్.

1. టాపిక్ ఎన్నిక:

బ్లాగింగ్ మొదలు పెట్టడానికి మీరు ఎన్నుకునే అంశంపై కనీస అవగాహన ఉండేలాగా ఉండాలి.

ఎన్నుకున్న అంశం యొక్క పూర్తి వివరాలను సమకూర్చుకోవాలి.

అనేక కొత్త బ్లాగులు కొన్ని వారాల్లో విఫలమవుతున్నాయి మరియు మెజారిటీ బ్లాగులు కొన్ని నెలల్లో విఫలమవుతున్నాయి.

మీరు ఎంచుకున్న బ్లాగింగ్ నిచ్చే అంశంపై మీకు నిజమైన ఆసక్తి ఉందని నిర్ధారించుకోండి. మీరు ఎంచుకున్న అంశం పై పూర్తి జ్ఞానము పనితనం కలిగి ఉండాలి. అప్పుడు డు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

2. బ్లాగింగ్ ప్లాట్ ఫామ్:

బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అనేది మీ కంటెంట్‌ను ప్రచురించడానికి  సృష్టించిన ఒక ఒక ప్లాట్ ఫామ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. వీటినే బ్లాక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు అని చెబుతారు.

యునైటెడ్ స్టేట్స్ లో బ్లాకు టెక్నాలజీ ఆధారంగా ఉపయోగించే బ్లాగింగ్ ఫ్లాట్ఫామ్ యొక్క స్టేటస్ చెక్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

వీటిలో బ్లాగర్, వర్డ్ ప్రెస్, టంబ్లర్ వాటిని ఉదాహరణగా చెప్పొచ్చు.

వర్డ్ ప్రెస్ అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్న ఓపెన్సోర్స్ డెవలపర్స్ తయారుచేసిన కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CMS) సాఫ్ట్వేర్ గా చెప్పొచ్చు. దీనిని పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు. 

ఈ CMS ని ఉచితంగా ఇన్స్టాలేషన్ చేసే లాగా హోస్టింగ్ డాష్ బోర్డు లో ఆ సౌకర్యాన్ని పొందుపరచి ఉన్నారు.  వాటిని ఉపయోగించుకుని, వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసి బ్లాగును ప్రారంభించవచ్చు.

3. డొమైన్ నేమ్:

డొమైన్ నేమ్ అంటే ఇంటర్నెట్ లో మీ వెబ్ సైట్ యొక్క చిరునామా అని చెప్పొచ్చు.

మీరు ఏ టాపిక్ ని ఎంచుకున్నా, మీ డొమైన్ పేరు మీకు ఆన్‌లైన్‌లో తెలిసిన పేరుగా ఉండాలి. ఇది ఇంటర్నెట్‌లో మీ బ్లాగ్ యొక్క ప్రత్యేక చిరునామా.

బ్లాగ్ పేరును ఎంచుకునేటప్పుడు మీరు పరిగణించవలసినవి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాము.

 • ఎన్నుకున్న డొమైన్ నేమ్ చిన్నదిగా, ఆకర్షణీయంగా, ఉచ్చరించడానికి మరియు టైప్ చేయడానికి సులభంగా ఉండాలి. 
 • మీరు మీ మొదటి మరియు చివరి పేర్ల కలయికలను కూడా ఉపయోగించవచ్చు (ఉదా. johnsmith.com లేదా tim.blog).

డొమైన్ నేమ్ ఎక్స్టెన్షన్స్ లో ముందుగా ఇవ్వాల్సిన ప్రాముఖ్యత “.com” కు మాత్రమే. ఎందుకంటే ఇది బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. 

అంతే కాదు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అన్ని దేశాలలోనూ ఓపెన్ అయ్యేలా చేస్తుంది ఉదాహరణకి “.in” తీసుకుంటే దాని యొక్క పూర్తి ప్రాముఖ్యత ఇండియా కంట్రీ కి మాత్రమే ఉపయోగపడే లాగా సెటప్ చేయబడి ఉంటుంది.

4. వెబ్ హోస్టింగ్:

డొమైన్ పేరును ఎంచుకున్న తర్వాత, నమ్మకమైన హోస్టింగ్ ను ఎంచుకోవడం అనేది మీరు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. 

మీ బ్లాగ్ యొక్క పనితీరు మీరు ఎన్నును కొనే హోస్టింగ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను సిఫార్సు  చేస్తున్న వెబ్ హోస్టింగ్ కంపెనీ bluehost

చాలా వరకు, మీ బ్లాగ్ యొక్క కార్యాచరణ మరియు పనితీరు మీ హోస్టింగ్ ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది. హోస్ట్ మీ బ్లాగ్ అందుబాటులో 24/7 ఉండేటట్లు చూడాలి.

మీరు గనుక కొత్త బ్లాగర్ అయినట్లయితే bluehost మీయొక్క అవసరాలని చక్కగా తీరుస్తుంది అని సిఫార్సు చేస్తున్నాను. మీ బ్లాగును నిరంతరం 24 గంటలు ఆన్ లో ఉండేలా చూస్తుంది.

మీరు కొత్త బ్లాగర్ అయితే, నేను ఉపయోగించమని సూచిస్తున్నాను బ్లూహోస్ట్ హోస్టింగ్.

Bluehost ను ఎందుకు నమ్మాలి అన్న విషయాన్ని కింద క్లుప్తంగా వివరించు చున్నాను.

 1. సెటప్ చేయడం చాలా తేలిక: Bluehost తో మీరు మీ బ్లాగును కొన్ని బటన్ క్లిక్‌లతో సెటప్ చేయగలరు. 
 2. మంచి సాంకేతిక మద్దతు : మీరు సరసమైన ధర వద్ద అద్భుతమైన కస్టమర్ మద్దతుతో నమ్మకమైన సేవను పొందుతారు. 
 3. అధునాతన ఫీచర్లు: మీరు మీ బ్లాగును ప్రారంభించడానికి, అమలు చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన గొప్ప ఫీచర్ల సెట్‌ను ఇవి అందిస్తాయి. 
 4. భద్రత : మీ బ్లాగ్ సందర్శకుల డేటాను సురక్షితంగా ఉంచడానికి ఉచిత SSL ప్రమాణపత్రం చేర్చబడింది మరియు ముందే ఇన్‌స్టాల్ చేయబడింది.
 5. ధృవీకరించబడిన ప్రొవైడర్ : Bluehost అధికారిక WordPress.org వెబ్‌సైట్‌లో సిఫార్సు చేయబడిన హోస్టింగ్ ప్రొవైడర్. 
 6. చాలా మంది ఉపయోగించారు : నేను వ్యక్తిగతంగా వారి సేవలను ఉపయోగిస్తాను మరియు చాలా మంది బ్లాగర్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నారు.
 7. సర్వే విజేత : మా పరిశోధన ఆధారంగా, చాలా మంది బ్లాగింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం Bluehost ఒక అగ్ర ఎంపిక గా ధ్రువీకరించ వచ్చును.

చివరి మాటలు

బ్లాగింగ్ చేయటానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా బ్లాగును ప్రారంభించి సక్సెస్ కావచ్చు. వీటికి కావలసిన కనీస రిక్వైర్మెంట్స్ తో ప్రారంభించవచ్చు. దీని గురించి వివరంగా ఈ పోస్టులో తెలియజేశాను. 

Similar Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి