what is search engine optimization (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్)

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి? తెలుగు లో మీకోసం

SEO అనగా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దీని ద్వారా ఒక కంపెనీ యొక్క ఉత్పత్తులను ఇంటర్నెట్ లో గూగుల్ మరియు బింగ్ సెర్చ్ ఇంజన్ ను వుపయోగించి అమ్మకాలను ప్రోత్సహించటానికి వాడే ఒక సాంకేతిక ప్రక్రియ. 

ఈ ప్రక్రియ ఎంత ఖచ్చితంగా చేస్తే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. అంటే మీ వ్యాపారానికి సంబందించిన ఉత్పత్తుల యెక్క వివరాలు సెర్చ్ ఇంజన్ కి పంపి సంబంధిత వ్యక్తుల ముందుకు సాంకేతికతను ఉపయోగించి పెట్టటమన్నమాట. మీ ప్రొడక్ట్స్ యొక్క వివరాలను వెబ్ పేజీలలో పొందుపరిచే విధానం పైన కూడా ఈ సెర్చ్ ఇంజన్ యొక్క పనితనం ఆధారపడి ఉంటుంది. దీనికి ఖచ్చితమైన SEO ప్లానింగ్ ఉండాలి. ఈ SEO ని ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా నా పాట ఆర్టికల్ లో బ్లాగింగ్ గురించి మరియు బ్లాగ్గింగ్ ప్లాటుఫామ్ ల గురించి చదవండి. మీకు ఒక ఐడియా వస్తుంది.

ఈ ఆర్టికల్ లో SEO గురించిన వివరాలు తెలుగు లో మీకోసం. 

అసలు SEO అంటే ఏమిటి?

SEO అనేది మీ వెబ్సైటు ను లేదా వెబ్ పేజీ ని సెర్చ్ ఇంజన్‌ల కోసం ఆప్టిమైజ్ చేసే పద్ధతి. SEO పద్ధతులు మీ కంటెంట్ నాణ్యత మరియు ఔచిత్యాన్ని మెరుగుపరచడం ద్వారా SERPలలో (సెర్చ్ ఇంజన్ ఫలితాల పేజీలు) మీ సైట్‌ను మరింత కనిపించేలా రూపొందించబడుతుంది, ఇది SERPలలో మీరు ఉన్నత ర్యాంక్ పొందేందుకు మీకు సహాయం చేస్తుంది. 

మీ వెబ్ సైట్ SEO ని మెరుగుపరచటం కోసం భిన్నమైన పద్దతులలో ఒకదానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడేలా రాయటం జరిగింది. 

SEO (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్) మరియు PPC (పే పెర్  క్లిక్) అనేవి రెండు వేర్వేరు విషయాలు అయినా రెండింటి లక్ష్యం వెబ్సైటు కు ట్రాఫిక్ ను రప్పించటమే.

Google ఎలా పని చేస్తుంది? 

Googleలో మంచి ర్యాంకింగ్ రావాలి అంటే SEO ప్లేనింగ్ పక్కాగా ఉండాలి. దీనికోసం మంచి కంటెంట్ ను కనుగొనటానికి చేసే ప్రయత్నం ఒకటైతే, అదిరాసింతర్వాత వెబ్ పేజీలో పబ్లిష్ చేయటం మరొక టాస్క్. ఒకసారి కంటెంట్ పబ్లిష్ అయినాక గూగుల్ క్రింది దశల వారీగా మన కంటెంట్ ని కనిగొని ఇండెక్స్ చేస్తుంది. ఈ దసలేమిటో చూద్దాం. 

  • క్రాలింగ్ (Crawling):  గూగుల్ ప్రత్యేకంగా కోడ్ చేయబడిన బాట్ ల ద్వారా కొత్త వెబ్సైటు లను మరియు కొత్త ఇన్ఫర్మేషన్ ద్వారా నవీకరించిన వెబ్ పేజీ లను పూర్తిగా crawl  చెక్ చేస్తుంది. ఇలా మీ పేజెస్ కు జరగాలంటే, మీ పేజెస్ లో తప్పని సరిగా ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ లింకులు ఉండాలి. క్రాలింగ్ అనేది పేజీలోని లింక్‌లను కొత్త పేజీలకు అనుసరించడం. కొత్త పేజీలలోని ఇతర కొత్త పేజీలకు లింక్‌లను కనుగొనడం మరియు అనుసరించడం కొనసాగించడాన్ని సూచిస్తుంది.
  • ఇండెక్సింగ్ (Indexing):  బాట్‌లు కనుగొన్న URLలను విశ్లేషించడం ద్వారా పేజీ దేనికి సంబంధించినదో అర్థం చేసుకోవడానికి Google ప్రయత్నిస్తుంది. కంటెంట్ (టెక్స్ట్), చిత్రాలు మరియు ఇతర మీడియా ఫైల్‌లు అన్నీ Google ద్వారా పరిశీలించబడతాయి. చివరిగా గూగుల్ ఈ డేటాబేస్ ను ఇండెక్స్ చేస్తుంది. ఈ పద్ధతినే ఇండెక్సింగ్ అంటారు. 
  • అందిస్తోంది (Search Results): వినియోగదారుల సెర్చ్ ప్రశ్నలకు ఏ పేజీలు అత్యంత సందర్భోచితంగా ఉన్నాయో Google గుర్తించిన తర్వాత, URLలను అంచనా వేసిన తర్వాత వాటిని SERP (Search Engine Results Page)లలో చూవుతుంది. .

సెర్చ్ ఇంజన్స్ కోసం మీ వెబ్సైటుని ఎందుకు ఆప్టిమైజ్ చెయ్యాలి?

మీ వెబ్సైటు ను సెర్చ్ ఇంజన్ ల కోసమా ఎందుకు ఆప్టిమైజ్ చెయ్యాలి అనే విషయం SEO  గురించి ఇంటర్నెట్ లో వెతికేటప్పుడు మరియు నేర్చుకునేటప్పుడు వచ్చే చాలా సాధారణమైన ప్రశ్న. ఇది పూర్తిగా మీరు రాయబోయే కంటెంట్ పైన మరియు దానిని ఆప్టిమైజ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది.  దీనికి సంబందించిన కొన్ని పాయింట్స్ SEO ఎందుకు, మరియు ఎలా  అనే విషయం కింద క్లుప్తంగా చూద్దాం. 

1. నాణ్యమైన కంటెంట్ ఉత్పత్తి:

SEO రూల్స్ ప్రకారం తయారు చేసే కంటెంట్లో నాణ్యత మరియు ఆకర్షణ ఉంటుంది అంతం లో ఎలాంటి సందేహం లేదు. వీటిలో 

  • గూగుల్ లో అధికంగా సెర్స్ ద్వారా అధికంగా వెదకబాదుతున్న కీవర్డ్స్ ను పొందుపరచటం 
  • ఇంటర్నల్ లింక్లను అదే వెబి సైట్ లో ఒకేలావుండే పేజీలను హైపెర్లింక్ చేయటం 
  • మీసైట్ లో ప్రతి పేజీ లో హోమ్ పేజీ లింక్ ను మెనూ లో పొందుపరచటం 

వీటివలన కంటెంట్ యెక్క నాణ్యత గూగుల్ అంచనావేస్తోంది. ఫలితం గ సెర్చ్ ఇంజన్ లో మంచి రాంక్ సాధ్యమవుతుంది. 

2. వెబ్ పేజీ ఆప్టిమైజషన్:

సెర్చ్ ఇంజన్ ఇండెక్సింగ్ కోసం మీ వెబ్‌సైట్‌ను ఆప్టిమైజ్ చేయడం అనే అంశం మీ వెబ్‌సైట్ ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఒకటి. దీనికోసం మీ కంటెంట్ ఫార్మాట్, సంబంధిత కీవర్డ్స్ వాడకం కంటెంట్లో సరిగా ఉందొ లేదో నిర్దారించు కోవాలి. అంతేకాదు మీసైతే లి RSS feeds ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనివలన మీ రీడర్స్ మీరు కొత్తగా రాసి పబ్లిష్ చేసిన కంటెంట్ ను వెంటనే పొందగలుగుతారు. 

3. సరైన URL ను వాడటం:

సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ ఫాక్టర్ లో ముఖ్యమైన అంశం బ్లాగ్ URL అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికోసం బ్లాగ్ పోస్ట్ url లో 3 నుండి 6 పదాలు ఉండేలా చూసుకోవాలి. ఈ పదాలలో మీరు ఆప్టిమైజ్ చేసే మేజర్ కీవర్డ్ ఉంచడం ద్వారా మరింత ఫలితం ఉంటుంది. 

4. రిసోర్సెస్ కి లింక్ చేయడం:

మీ వెబ్ పేజీ లోని కంటెంట్ రాయడం లో మీరు నమ్మిన రెకమెండేషన్స్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ సైట్ లో వుండే పేజీ కావచ్చు లేదా వెబ్ లో అధిక పాపులారిటీ పొందిన ఎక్స్పర్ట్ గైడ్ కావచ్చు. దీనిని హైపర్ లింక్ చేయటం ద్వారా మీ బ్లాగ్ మరియు కంటెంట్ పైన మరింత విశ్వాసనీయత మీ రీడర్స్ పొందుతారు. 

ఆన్లైన్ మార్కెటింగ్ కోసం SEO ఎందుకు ముఖ్యమైనది?

Google మరియు Bing వంటి సెర్చ్ ఇంజన్‌లు వెబ్‌లో పేజీలను క్రాల్ చేయడానికి, సైట్ నుండి సైట్‌కు వెళ్లడానికి, ఆ పేజీల గురించి సమాచారాన్ని సేకరించడానికి మరియు వాటిని ఇండెక్సింగ్ డేటాబేస్ లో ఉంచడానికి బాట్‌లను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక లైబ్రేరియన్ చదవడానికి పుస్తకాన్ని పైకి లాగగలిగే ఒక పెద్ద లైబ్రరీ వంటి సూచిక గురించి ఆలోచించండి. ఈ crawlers మరియు bots అలాంటివే. 

ఎవరైనా Googleలో ఒక కీవర్డ్ ను (EX: Weight Loss) టైపు చేసి ఇన్ఫర్మేషన్ కోసం వెతకటం మొదలు పెట్టినప్పుడు, BOTS వెబ్ లోని ఆ పదానికి సంబందించిన పేజీలను వెతకటం ప్రారంభిస్తుంది. ఫలితంగా సంబందించిన ఇన్ఫర్మేషన్ కలిగిన వెబ్ పేజెస్ ని గూగుల్ ఇండెక్సడ్ డేటాబేస్ సహాయం తో యూసర్ కి SERP లో చూపుతుంది. 

మీరు మీ వెబ్ పేజీ లోని కంటెంట్ కు సరిగ్గా సేవ్ చేస్తే గూగుల్ మీ పేజెస్ ని గూగుల్ ర్యాంకింగ్ ఫాక్టర్స్ ఆధారంగా SERP లో మొదటి పేజీ లో చూపుతుంది. ఫలితం గా మీ లింకుని క్లిక్ చేసి వెబ్పగే లోనికి వచ్చిన రీడర్ డీటెయిల్స్ అయినా Name మరియు Email కాప్చర్ చేసి మీకు రెగ్యులర్ రీడర్ లేదా కస్టమర్ గా మార్చుకోవచ్చును.  

సెర్చ్ ఇంజన్ ఫలితాల్లో చేర్చడం కోసం వెబ్‌సైట్‌ను ఇండెక్సింగ్ చేస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజన్ అల్గారిథమ్‌లు వందలాది అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.  వీటిలో కొన్ని 

  • సైట్ ఆర్కిటెక్చర్ మరియు డిజైన్
  • అంతర్గత లింక్‌లు (మీ సైట్‌లోని ఇతర పేజీలకు తిరిగి సూచించే సైట్‌లోని లింక్‌లు)
  • వెబ్ పేజీ కంటెంట్ (టైటిల్, మెటాడేటా, చిత్రాలు మరియు H1ట్యాగ్‌లతో సహా)
  • మీ సూచిక చేయబడిన పేజీల గురించి టైటిల్ ట్యాగ్ మెటాడేటా (టైటిల్ ట్యాగ్ రకం, వివరణ పొడవు మొదలైనవి). 

ప్రాథమిక సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పద్ధతులు

SEO ను వివిధ పద్ధతుల ద్వారా సాధించవచ్చు. చాలా SEO పద్ధతులు ఈ క్రింద ఇవ్వబడిన వర్గాలలో ఒకదానిలోకి వస్తాయి. 

మీ వెబ్‌సైట్‌లను ఆప్టిమైజ్ చేయడానికి మరియు పోటీ సైట్‌ల (Competitors) యొక్క ఫలితాలను  ఆధారం గా  డాటాను తయారు చేసుకోవాలి. ఇలా దృశ్యమానతను మెరుగుపరచడానికి అనేక ఇతర మార్గాలు అయిన అద్భుతంగా పనిచేసే SEO టూల్స్ ని అభివృద్ధి చేసి ఆన్లైన్ లో చాల సంస్థలు అందిస్తున్నాయి. వీటి ద్వారా మరింత ఫలితం తక్కువ సమయం లోనే పొందొచ్చు. 

శోధన ఇంజన్ ఆప్టిమైజేషన్‌లో ఉపయోగించే కొన్ని మార్గాలు:

1. కీవర్డ్ రీసెర్చ్ (Keyword Research):

ఇది SEOలో ఒక సాధారణ మొదటి దశ.  సైట్ ప్రస్తుతం ఏ కీలకపదాలకు ర్యాంక్ ఇస్తోంది, పోటీదారులు ఏ కీలకపదాల కోసం ర్యాంక్ చేస్తున్నారు మరియు వినియోగదారులు ఏ అదనపు కీలకపదాల కోసం శోధిస్తున్నారు అనే విషయాలు ఈ కీవర్డ్ రీసెర్చ్ లోనికి వస్తాయి. 

Google మరియు ఇతర శోధన ఇంజన్‌లలో యూజర్స్ ఉపయోగించే పదాలలో  ఏది ఆప్టిమైజ్ చేయవచ్చు మరియు కొత్త కంటెంట్ గా ఏ టాపిక్ ని ఎన్నుకోవచ్చు అనే విషయాలు ఈ పద్దతి ద్వారా చేయవచ్చు. 

2. కంటెంట్ మార్కెటింగ్ (Content Marketing)

శక్తివంతమైన కీలకపదాలు గుర్తించబడిన తర్వాత మాత్రమే ఈ కంటెంట్ మార్కెటింగ్ చేయగలుగుతాము. దీనిలో అదనపు సమాచారాన్ని నవీకరించడం లేదా ఉత్పత్తి చేయడం మరియు కొత్త కంటెంట్‌ని సృష్టించడం వంటి అంశాలు వస్తాయి. . ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను పరిశోధించడం మరియు వినియోగదారులకు మంచి  అనుభవాన్ని అందించే కంటెంట్‌ను రూపొందించడం చాలా అవసరం. 

Google మరియు ఇతర సెర్చ్ ఇంజన్‌లు అధిక-నాణ్యత కలిగిన కంటెంట్‌కుప్రాముఖ్యత ఇస్తున్నందున సెర్చ్ ఇంజన్ ఫలితాల్లో అధిక ర్యాంక్‌ని పొందే అవకాశం ఉంటుంది. ఇంకా, మరింత విలువ కలిగిన కంటెంట్ కోసం సోషల్ మీడియా భాగస్వామ్యం మరియు సోషల్ కమ్యూనిటీ లో ఎక్కువగా షేరింగ్ జరుగుతున్న కంటెంట్ టాపిక్స్ ను కూడా ఈ మార్కెటింగ్ లో ముఖ్య అంశాలు గానే పరిగణనలోనికి తీసుకుంటారు. 

3. లింక్ బిల్డింగ్ (Link Building)

గూగుల్ మరియు రముఖ సెర్చ్ ఇంజన్ స్ యొక్క ముఖ్యమైన ర్యాంకింగ్ ఫాక్టర్స్ లో లింక్ బిల్డింగ్కు చాల ప్రాముఖ్యత వుంది. వీటినే బ్యాక్ లింక్స్ అని కూడా అంటారు. బ్యాక్ లింక్స్ అంటే బయటి వెబ్సైటులో మీ వెబ్సైటు లింక్ ని రిఫెరల్ లింక్ గా చేర్చే ప్రక్రియ. హై పేజీ రాంక్ లేదా డొమైన్ రాంక్ వున్నా వెబ్ సైట్ నుండి మీ సైట్ కు బ్యాక్ లింక్ పొందటం అనేదే ముఖ్యమైన  ర్యాంకింగ్ ఫాక్టర్ గా SEO లో చెప్పొచ్చు. దీనిని Off-Page SEO లో ఒక భాగంగా చెప్పొచ్చు. 

ఇందులో

  • నాణ్యమైన మెటీరియల్‌ని తయారుచేసి హై ర్యాంకింగ్ వెబ్సైట్ కి సబ్మిట్ చేయటం ద్వారా, 
  • ఇతర వెబ్‌మాస్టర్‌లతో నెట్‌వర్కింగ్ చేయడం ద్వారా, 
  • సంబంధిత వెబ్ డైరెక్టరీలకు మీ వెబ్‌సైట్‌లను సమర్పించడం ద్వారా మరియు 
  • ఇతర సైట్‌ల నుండి లింక్‌లను పొందడానికి వారి కమ్యూనిటీ లో చేరి వెబ్ అడ్మిన్స్ కి కనెక్ట్ అయ్యి లింక్స్ ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. 

4. సైట్ ఆర్కిటెక్చర్ ఆప్టిమైజషన్ (Site architecture optimization)

SEO ర్యాంకింగ్ లో సైట్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. దీనిలో క్రింది విషయాలు ముఖ్యం గా చెప్పవచ్చును. 

  • ఇంటర్నల్ లింక్స్ అంటే ఒక పేజీ నుండి అదే వెబ్సైటు లోని వేరొక పేజీ కి వేళ్ళ గలిగే లింక్స్.  ఇలా లింక్ చేయటానికి వాడే  కంటెంట్ లోని పదాలను Anchor Text అని పిలుస్తారు. ఈ Anchor Text కి లింక్ చేసే పేజీ కి సరిపోయే అర్ధం వచ్చేలా ఉండాలి. 
  • XML సైట్ మాప్: ఇది మీ సైట్ లో జరిగే ప్రతి అప్డేట్ లేదా కొత్తగా పబ్లిష్ చేసిన కంటెంట్ ను గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ద్వారా గూగుల్ సెర్చ్ ఇంజన్స్ కి చేర్చి ఇండెక్స్ అయ్యేలా చేసే ముఖ్యమైన ఫైల్. దీని ద్వారా మీ సైట్ లోనికి గూగుల్ Bots చేర్చి మీ కంటెంట్ని crawl చేసేలా చేస్తుంది. ఫలితంగా చిన్న పేజెస్ నుండి ఎక్కువ కంటెంట్ వున్నా పేజీ వరకు అన్నింటికీ ప్రయోజనం చేరుతుంది. 

5. సెమాంటిక్ మార్కప్ (Semantic markup)

వెబ్‌సైట్ సెమాంటిక్ మార్కప్‌ని ఆప్టిమైజ్ చేయడం అనేది నిపుణులు ఉపయోగించే మరొక SEO టెక్నిక్. టాపిక్ యొక్క భాగాన్ని రచయిత మరియు పేజీలోని మెటీరియల్ రకం మరియు దాని అర్థం సెమాంటిక్ మార్కప్ (Schema.org వంటివి) ఉపయోగించి వివరించడం జరుగుతుంది. 

సెమాంటిక్ మార్కప్ సహాయంతో సెర్చ్ ఫలితాల (SERP) పేజీలో అదనపు కంటెంట్, రివ్యూ రేటింగ్ స్టార్స్, మరియు ఉపయోగించే ఇమేజెస్ వంటివి  రిచ్ స్నిప్పెట్‌ ద్వారా  చూపించ వీలవుతుంది. 

రిచ్ స్నిప్పెట్‌ ద్వారా SERP లో పెద్దగా ఫలితం లేకపోయినప్పటికీ, CTR ని పెంచటం ద్వారా వెబ్సైటు కు ట్రాఫిక్ పెరగటానికి ఉపయోగపడుతుంది. 

6. ఆన్-పేజీ ఆప్టిమైజేషన్ (On-page optimization)

వెబ్ పేజీ యొక్క నిర్మాణాన్ని SEO  కోసం మెరుగుపరచడం అనేది పూర్తిగా వెబ్ మాస్టర్స్ యెక్క పని మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో లింక్స్ (ఇంటర్నల్ లింక్స్ మరియు ఎక్స్టర్నల్ లింక్స్)  వంటి కారకాలు కూడా ముఖ్య మైనవే. 

మెయిన్ కీవర్డ్స్ ను టైటిల్ టాగ్, మెటా డిస్క్రిప్షన్, పెర్మాలింక్ (బ్లాగ్ పోస్ట్ లింక్) మరియు ఇమేజెస్ లో ALT Text లో ఉంచటం అనేది దీనిలోని ముఖ్య అంశాలు. 

SEO యొక్క ప్రయోజనాలు ఏమిటి?

SEO అనేది Google వంటి సెర్చ్ ఇంజన్‌లలో మీ వెబ్‌సైట్‌ను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇది ఒక మార్గం. ఇలా చేయడం ద్వారా, కొత్త కస్టమర్‌లు మీ వెబ్‌సైట్ గురించి తెలుసుకుంటారు మరియు దాన్ని తరచూ సందర్శిస్తారు . ఈ విధంగా మీరు మీ బిజినెస్ మరియు అమ్మకాలను పెంచుకోవచ్చు. 

  • మీరు సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్‌లో ఉన్నత స్థానంలో ఉంచటం. మీ సైట్‌ని ఎక్కువ మంది వీక్షించగలరని దీని అర్థం. 
  • దీనిని ఉపయోగించడానికి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు.  వ్యాపార ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఈ సాంకేతికతపైనే ప్రస్తుతం  ఆధారపడుతున్నారు మరియు దాని ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నప్పటికీ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ సంప్రదాయ ప్రకటనల కోసం వేల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి అంటే మీరు నమ్మగలరా? 
  • మీరు SEO కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ సైట్ సెర్చ్ ఇంజన్‌లలో బాగా రాంక్ అయ్యేలా చేసికుంటే, మీ టార్గెట్ ఆడియెన్స్ మీ సైట్‌ని సందర్శిస్తారు. వారిని ఆకర్షించడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. 
  • ఇది సోషల్ మీడియాలో మీ సైట్ యొక్క ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా, వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా కూడా మీ సైట్ గురించి తెలుసుకుంటారు మరియు మీరు మరింత సందర్శకులయూ పొందగలుగుతారు. 

చివరి మాటలు

క్లుప్తంగా చెప్పాలంటే SEO అనేది సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ ద్వారా ఇంటర్నెట్ లో మీ వెబ్సైటు యొక్క విసిబిలిటీని పెంచే ప్రక్రియ. 

సరళంగా చెప్పాలంటే, SEO అనేది అధిక శోధన ఇంజన్ ర్యాంకింగ్‌ల ద్వారా వెబ్‌సైట్ యొక్క ఆన్‌లైన్ విజిబిలిటీని పెంచే ప్రక్రియ.

ఈ ప్రక్రియ ద్వారా వెబ్‌సైట్ యొక్క ఆన్-పేజ్ ఆప్టిమైజేషన్ మరియు ట్రాఫిక్ పెంచడానికి, గెస్ట్ పోస్టింగ్ చేయటానికి  మరియు లింక్ బిల్డింగ్ వంటి ఆఫ్-పేజీ మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. 

SEOలో విజయాన్ని సాధించడానికి ఉపయోగించే అనేక SEO సాధనాలు ఇంటర్నెట్ లో ఉన్నాయి. అయితే  మీ కంపెనీకి ఉత్తమమైన ఎన్నుకోవడం చాలా ముఖ్యం.

పైన తెలిపిన SEO గురించిన విషయాల్లో మీ అనుభవాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయ గలరు.  ఈ టాపిక్ గురించి మరిన్ని విషయాలు రాబోయే ఆర్టికల్స్ లో మరింత వివరం గా తెలియజేస్తాను. 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి